Friday, 6 November 2026

మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత

మంత్రి నిరంజన్ రెడ్డి కాన్వాయ్ అడ్డగింత
వాల్మికి లను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్

గద్వాల ప్రతిన తెలంగాణ ప్రభుత్వం వాల్మికి కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చి , హామి పై ప్రభుత్వం స్పందన లేదని గత 20 రోజులు గా జిల్లా కేంద్రాలలో నిరసన రిలే దీక్షలు చేపడుతున్నామని కానీ మంత్రులు కనీసం స్పందించడం లేదని అందుకు నిరసనగా మంగళవారం మంత్రి నిరంజన్ రెడ్డీ అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు గద్వాల పట్టణానికి రావడం తో వాల్మికి నాయకులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకొని వినతి పత్రం సమర్పించారు. మంత్రి వాల్మికి నాయకుల తో మట్లాడుతూ…. రాబోయే అసెంబ్లీ సమావేశం లో ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక బిల్ పెట్టేందుకు కృషీ చేస్తానని నాయకులకు తెలిపారు. గతం లో కేంద్రానికి పంపిన బిల్ పై నాలుగు సంవత్సరాల తరువాత తిరిగి రాష్ట్రానికి పంపిందని , వాల్మికి డిమాండ్ పై ప్రభుత్వం సానుకూలంగా వున్నదని తెలిపారు.వాల్మికి డిమాండ్ పై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని న్యాయం జరిగే విధంగా కృషీ చేస్తానని మంత్రి నిరంజన్ రెడ్డీ నాయకులకు తెలిపారు. అనంతరం వాల్మికి నాయకులు మంత్రి కి వినతి పత్రం ఆయనకు సమర్పించారు.