హైదరాబాద్ : మంత్రి సునీతా అక్ష్మారెడ్డి నివాసం వద్ద అంధులు సోమవారం ఆందోళనకు దిగారు. ముషీరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద పెట్రోల్ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులు… తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని బెదిరించటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న పలువురు అంధులను పోలీసులు అరెస్ట్ చేశారు.




