మంత్రి పువ్వాడని కలిసిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
– రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమాండ్ల చారి అధ్యక్షతన మంత్రిని కలసిన సంఘం నాయకులు
– కమ్యూనిటీ హాల్ కొరకు వినతి పత్రం అందజేత
– సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, డిసెంబర్ 13(జనంసాక్షి) : రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమండ్ల చారి అధ్యక్షతన సోమవారం ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యవర్గ సభ్యులు స్థానిక క్యాంప్ కార్యాలయంలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు విశ్వబ్రాహ్మణుల సమావేశానికి కమ్యూనిటీ హాల్ కొరకు సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహాయం అందజేస్తామన్నారు.
విశ్వబ్రాహ్మణులకు టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తెలంగాణ సిద్దించడంలో విశ్వ బ్రాహ్మణుల కృషి ఎంతో వుందని మంత్రి గుర్తు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమండ్ల చారి మాట్లాడుతూ.. ఖమ్మం విశ్వ బ్రాహ్మణ సంఘం నకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన మంత్రి పువ్వాడ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల బ్రహ్మచారి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమాదేవి, అధికార ప్రతినిధి, సూర్యపేట జిల్లా అధ్యక్షులు కే నాగేంద్రా చారి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు అలువాల నాగేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు జూకంటి శంకర్, ప్రధాన కార్యదర్శి ఎనగాల ఉపేంద్ర చారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అబ్బన పూరి నాగమణి, జిల్లా గౌరవ సలహాదారి రవి, అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణులు
పాల్గొన్నారు.




