రఘునాథపాలెం మార్చి 02 (జనం సాక్షి) మండలం వేపకుంట్ల గ్రామ రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడే డొంక రోడ్డు అభివృధ్ధి పై దృష్టి సారించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 7లక్షలు రూపాయలు నిధులు మంజూరు ప్రగతి పథంలో వేపకుంట్ల నుండి చింతగుర్తి ఆర్ & బి రోడ్డు వరకు నూతనంగా రైతులు ఉపయోగ పడే విధంగా నిర్మాణం చేపట్టటం జరిగిందని
పంట పొలాల్లోని వేళ్ళాడానికి, పంట ఉపయోగించే ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, తదితర వాహనాలు రవాణాకు రైతులకు మంత్రి అజయ్ కృషితో నిర్మాణమైన ఈ రోడ్డు ఎంతో దోహద పడనున్నాయి. ఈ నేపథ్యంలో తమ అవస్థలను గుర్తించి డొంక రోడ్డు అభివృధ్ధి చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి రైతులు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామ్ ఎక్స్ జెడ్ పిటీ సి కుర్రా భాస్కరావు ఐలా నర్సింహారావు కోటగిరి విరయ్య ఐలా రాకేష్ తదితరులు పాల్గొన్నారు
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చోరవతో డొంక రోడ్ అభివృద్ధి




