Wednesday, 4 November 2026

మంత్రి మల్లారెడ్డికి ప్రజల విజ్ఞప్తి * బస్టాండు మరుగుదొడ్లు లేక ప్రయాణికుల ఇక్కట్లు * తాత్కాలిక షెడ్ల పేరుతో ప్రభుత్వ స్థలం కబ్జా * నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు * ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని స్థానికుల డిమాండ్

 

 

 

 

 

 

 

 

 

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 6 :-. మేడ్చల్ నియోజకవర్గంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే ప్రాంతం జవహార్ నగర్ ఒక శాసనసభ్యుడు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయ డంక మోగించాలంటే ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి అధిక మొత్తంలో ఓట్లు కలిగి ఉన్న జవహర్ నగర్ పైనే ప్రత్యేక దృష్టి సారిస్తారు రెండు లక్షల పైచిలుకు జనాభా కలిగి ఉన్న జవహర్ నగర్ ప్రజల ఓట్లను ఎలా దండుకోవాలి అనే యుచన పై ఉన్న శ్రద్ధ జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో చూపకపోవడం దురదృష్టకరమని జవహర్ నగర్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు విషయానికి వస్తే జవహర్ నగర్ పరిధిలో ఉన్న 6500 పైచిలుకు ఎకరాల భూములన్ని ప్రభుత్వ భూములే అయినప్పటికీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పక్కన మహనీయులు బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాల వద్ద ఉన్నటువంటి జవహర్ నగర్ ప్రధాన బస్టాండ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండు నిర్మాణంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలం లేకపోవడం ఏమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బస్టాండు నిర్మాణం కోసం అనుకూలంగా ఉన్న 434 సర్వే నెంబర్ కు చెందిన స్థలాన్ని ఆక్రమించి హస్తగతం చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా తాత్కాలిక కమర్షియల్ రేకుల షెడ్ల నిర్మాణాలు సిమెంటు ఇటుకల రూముల నిర్మాణాలు చేపడుతూ కబ్జాకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు చేతులు ముడుచుకొని చోద్యం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు సముద్రాన్ని తలాపున పెట్టుకొని చాప దూపకు ఏడ్చింది అన్న చందంగా ప్రభుత్వ స్థలాన్ని బస్టాండ్ సమీపంలోనే పెట్టుకొని కూడా ప్రధాన బస్టాండ్ లో బస్సులు నిలపడానికే కాకుండా తిరగడానికి కూడా ఈ రోజుల్లోనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే రాబోవు రోజుల్లో ఇంకా ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయో అని ప్రజలు మదన పడుతున్నారు ఇప్పటికైనా జవహర్ నగర్ ప్రజలు నా గుండెకాయ లాంటి వారు అని అనునిత్యం సభ సమావేశాల్లో చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి బస్టాండ్ లో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపై వేచి చూస్తూ బస్సులు ఎక్కే తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించి జవహర్ నగర్ ప్రధాన రహదారి నిర్మాణంతో పాటు ప్రధాన బస్టాండ్ వద్ద గల 434 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ కమర్షియల్ షెడ్లను అక్రమ మార్గంలో చేపడుతున్న రూముల నిర్మాణాలను తొలగించి ఈ ప్రభుత్వ భూమిలో ప్రయాణికుల సౌకర్యార్థం మరుగుదొడ్లతో పాటు విశాలమైన బస్టాండు నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు