Wednesday, 4 November 2026

ఈ నెల 31న కొమురవెల్లికి తరలిరండి

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 06 (జనం సాక్షి)ఈనెల 31న బుధవారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ప్రారంభోత్సవం కానున్న మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర భవన నిర్మాణ పూజా కార్యక్రమానికి మున్నూరు కాపులంతా తరలిరావాలని కొమురవెల్లి మల్లన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పు రవీందర్ కోరారు ఈ మేరకు శనివారం వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో అన్నదాన సత్ర నిర్మాణానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉప్పు రవీందర్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్ర భవనం నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పెద్దలు గూడెపు ప్రవీణ్ పటేల్ మొగిలి దుర్గాప్రసాద్ పటేల్ ఎడ్ల సురేందర్ పటేల్ మాడిశెట్టి మురళి పటేల్ వలిశెట్టి సుధాకర్ పటేల్ అల్లం మల్లికార్జున్ పటేల్ దశరథం పటేల్ తదితరులు పాల్గొన్నారు.