మంత్రి సారయ్యను నిలదీసిన మహిళలు

వరంగల్‌: తన సొంత నియోజకవర్గమైన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తున్న మంత్రి బస్వరాజు సారయ్యకు వూహించిన విధంగా చుక్కెదురైంది. నియోజకవర్గంలో తాగునీరు, ఇతర సమస్యలపై మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రిని డిమాండ్‌ చేశారు.