ముషీరాబాద్: తమ సమస్యలపై వికలాంగులు మంత్రి సునీతాలక్ష్మారెడ్డి నివాస ముట్టడికి యత్నించారు. పెరిగిన నిత్యవసరాల ధరలకనుగుణంగా పింఛన్‌ను రూ.500 నుంచి రెండు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ముషీరాబాద్‌లోని మంత్రి ఇంటిముందు వికలాంగులు ధర్నా చేపట్టారు. ఇంటిని ముట్టడించడానికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.




