మంత్రి హరీష్ రావుకు మైనంపల్లి హనుమంతరావు బహిరంగ క్షమాపణ చెప్పాలి*
వీణవంక ఆగస్టు 22 (జనం సాక్షి )వీణవంక నిన్న ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తన కుమారుని పేరును ప్రకటించలేదన్న ఆక్రోషంతో అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి వ్యతిరేకంగా హరీష్ రావు పై వ్యక్తిగతంగా విమర్శ చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా విమర్శ చేసిన మైనంపల్లి హనుమంతరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నాటి నుండి నేటి వరకు రాష్ట్ర అభివృద్ధి దేంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో మచ్చలేని మహనీయుడుగా ప్రజల మనసులు గెలిచిన ప్రజా నాయకుడు హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని గతంలో ఇదే మైనంపల్లి హనుమంతరావు అనేక సమావేశాలలో హరీష్ రావు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందులో ముఖ్యంగా వైద్య రంగాన్ని అభివృద్ధి చెందడంలో హరీష్ రావు పాత్ర కీలకమని మాటలు మాట్లాడి నేడు వాటిని మరవడం బాధాకరం ఇప్పటికైనా మంత్రి తన్నీరు హరీష్ రావుకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మైనంపల్లి హనుమంతరావు పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కోరారు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పలని హెచ్చరించారు