మంత్రి హరీష్ రావు సభ సక్సెస్
భారీగా హాజరైన జనం
బిచ్కుంద డిసెంబర్ 03 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నూతన మండలకేంద్రంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన సభ విజయవంతం అయింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని, డయాలసిస్ పేషంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 83 కు పెంచుకున్నామన్నారు. వారం 10 రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభిస్తామన్నారు. కడుపులో బిడ్డ పుట్టగానే ఇచ్చేది కేసీఆరే కిట్స్, పుట్టక ముందు ఇచ్వేది న్యూట్రిషన్ కిట్. మాది సంక్షేమ రాష్ట్రం మీది సంక్షోభ పాలన అని భాజాపాను విమర్శించారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పటేల్, ఎమ్మెల్యే షిండే, భాస్కర్ రెడ్డి, వీజీ గౌడ్, దఫేదార్ శోభ, నాల్చర్ రాజు, అసద్ అలీ, మొయిన్ పటేల్, అక్షయ్ పటేల్, హరీష్ షిండే, పాకలి శ్రీనివాస్, శివకుమార్ గౌడ్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి హరీష్ రావు సభ సక్సెస్ భారీగా హాజరైన జనం




