Tuesday, 3 November 2026

కొల్లాపూర్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్

జనం సాక్షి కొల్లాపూర్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో గాయత్రి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నేడు నూతనంగా గాయత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది.హాస్పిటల్ యాజమాన్యం చింతలపల్లి ప్రవీణ్ రావు గారి ఆహ్వానం మేరకు టీపీసీసీ సభ్యులు శ్రీ రంగినేని అభిలాష్ రావు గారు గాయత్రి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.కొల్లాపూర్ ప్రాంత వాసులకు భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని అభిలాష్ రావు గారు కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య గారు,దేదినేనిపల్లి గ్రామ అధ్యక్షుడు కాశన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింహ,వెంకటేష్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.