Monday, 2 November 2026

మంత్రులపై రైల్‌రోకో కేసుకొట్టివేత

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : రైల్‌రోకో కేసులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, పద్మారావులకు విముక్తి లభించింది. ఈ కేసును సికింద్రాబాద్‌ రైల్వే కోర్టు కొట్టి వేసింది. బుధవారం వీరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. మంత్రులు నాయిని, కేటీఆర్‌, పద్మారావు సహా 14 మందిపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి జంక్షన్‌లో రైల్‌రోకో నిర్వహించిన సందర్భంగా కేసు నమోదైన విషయం తెలిసిందే. పలు వాయిదాలు అనంతరం ఈ కేసును కొట్టేశారు.

దీనిపై గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌ రైల్వేకోర్టులో జరుగుతున్న విచారణకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, పద్మారావు సికింద్రాబాద్‌ రైల్వే కోర్టులో తరచూ హాజరవుతున్నారు.

బుధవారం మంత్రులు తుది విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దీనిపై పలుసార్లు విచారించిన రైల్వేకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు నాయిని, కేటీఆర్‌, పద్మారావు సహా 14 మందిపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. దీనిపై మంత్రి కె తారకరామారావు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు ఇలా గడిచింది అనుకొనేలోపు ఇంకా ఆరు కేసలు పెండింగ్‌లో ఉన్నాయంటూ లాయర్‌ గుర్తుచేశారని సోషల్‌ విూడియా ట్విట్టర్‌లో తెలిపారు.