Wednesday, 4 November 2026

మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు

మంథని, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన కెక్కర్ల రవి గౌడ్ కాలు విరిగి అనారోగ్యంతో బాధపడుతుండగా మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం పరామర్శించారు. కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామానికి చెందిన మూల శ్రీనివాస్ రెడ్డి , చైతన్యపురి కాలనీకి చెందిన వేగొలపు శంకర్ గౌడ్ లు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారిని సైతం ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అదే విధంగా ఇటీవల చనిపోయిన డాక్టర్ అవధానుల శాంత నరహరి , జంగంపల్లి కనకయ్య, మాణిక్యం పాస్టర్, పెంట అశోక్ ల ఇండ్లకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.