Wednesday, 4 November 2026

సహాయ ఆధ్వర్యంలో సిమెంటు ఇటుకలు అందజేత

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని అంబెడ్కర్ నగర్ లో ఇల్లు కూలి అవస్థలు పడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన జంజర్ల శంకరమ్మకి దాతల సహకారం తో సహయా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మాణానికి సిమెంట్, ఇటుకలను అందజేశారు. సహాయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు తూము రవీందర్, చైర్మన్ మేడగొని వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ బొడ్డు సతీష్, కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్, కోశాధికారి కొమురోజు సురేష్, సభ్యులు ఐతు డేవిడ్, నార్ల విజయ భాస్కర్, ఎండీ ఖాజా పాల్గొన్నారు.