జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో కోతుల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ప్రత్యేక చొరవ తీసుకొని నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కోతులను పట్టే కార్యక్రమాన్ని పర్యవేక్షణ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ , 11వ వార్డు కౌన్సిలర్ వికె రవి బుధవారం పర్యవేక్షించారు.
మంథనిలో కోతుల బెడద నివారణకు చర్యలు




