Monday, 2 November 2026

అచ్చేదిన్ పేరుతో సచ్చే దిన్ తెచ్చిండ్లు. -ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్.

బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )
కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు అచ్చేదిన్ తీసుకొస్తామని చెప్పి సచ్చేదిన్ తీసుకోచ్చారని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 50 పెంచి పేద, మద్య తరగతి బతుకులను ఆగం చేస్తుందన్నారు. బ్లాక్ మని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మిత్రుడు అదాని చేసిన నష్టాన్ని పుడ్చడానికి గ్యాస్ ధరలు పెంచారా? అసలు ఎందుకు వంట గ్యాస్ ధరలు పెంచాల్సి వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. కమర్శియల్ గ్యాస్ ధర ఏకంగా 350 రూపాయలు పెంచడం దారుణం అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించక పోతే ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.