మంథని డివిజన్ కు రూ.2.61 కోట్ల నిధులు మంజూరు
– మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెల్లడి జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల క్రింద మంథని డివిజన్ కు రూ.2 కోట్ల 61 లక్షలు మంజూరు అయినట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలాల్లో గంగాపురి, శ్రీరామ్ నగర్, సురయ్యపల్లి, పుట్టపాక, ఎక్లాస్ పూర్, న్యూ రచ్చపల్లి, లక్కేపూర్, బిట్టు పల్లి, గోపాల్ పూర్, చిల్లపల్లి, నాగేపల్లి, గుంజపడుగు, ముస్త్యాల, సుందిళ్ల, ఆదివారం పేట, అడవి శ్రీరాంపూర్, దర్యాప్తుర్ మోడల్ స్కూల్, ఖమ్మం పల్లి, కమాన్పూర్ గుండారం లలో 20 బస్సు షెల్టర్లు నిర్మాణానికి గాను రూపాయలు 62 లక్షలు మంజూరు అయ్యాయి. వీటితోపాటు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించారు. అభివృద్ధి పనుల నిమిత్తం 2 కోట్ల 61 లక్షల రూపాయలకు సంబంధించిన బస్ షెల్టర్స్, సిసి రోడ్లు/డ్రైన్స్ , కమ్యూనిటి హల్స్, బోర్ వెల్స్, మెటల్ రోడ్డు,రోడ్డు, ఐమాస్ సెంట్రల్ లైట్స్, ఇతర పనులు మంజూరు చేసిన , మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఆయా మండలాల, గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.