జనం సాక్షి , మంథని :మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.ఆదివారం రాజా గృహలో నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యవర్గ సభ్యులుపెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కలిసి మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. మంథని మార్కెట్లో గల మత్స్యశాఖ ఫిష్ మార్కెట్లో నూతనంగా బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాలని అధ్యక్షుడు పోతరవేని క్రాంతి కుమార్ ప్రతిపాదించడం జరిగింది దీనికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు మంజూరు చేస్తామని మత్స్య కార్మికులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధ్యక్షులు పోతరవేని క్రాంతి కమిటీ సభ్యులు అంకరి కుమార్, గుండా సాగర్,గుండా రాజు, బయ్య రాజేష్ సంఘం సభ్యులు మబ్బు నాగరాజు, పోలు కనక రాజు, గుండా రాజబాబు, తీగల నరేష్, పోలు రేవంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




