జనం సాక్షి కొల్లాపూర్ ఫిబ్రవరి .12రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర కు కొనసాగింపుగా,టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు జటప్రోలులో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ఇంటింటికి తిరుగుతున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు.పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు,కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర జటప్రోలు లో గ్రామంలో తిరుగుతూ బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు మోసాలను ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ ,కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ గాని, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు గానీ, గతంలో పట్టాలిచ్చిన పోడు భూముల రైతులకు తిరిగి పట్టాలిస్తామని, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తామని గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తామని అన్నారు. పెట్రోల్ రేట్లు బస్సు చార్జెస్ కరెంట్ చార్జెస్ పెంచడని బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యుల ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.కౌలు రైతులకు కూడా రైతుబంధిస్తామని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కొల్లాపూర్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు వనపర్తి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుగం నరసింహ్మ యాదవ్ జటప్రోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నరేష్ యాదవ్, అబుబాకర్, ఆరిఫ్ భాష ,వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




