Wednesday, 4 November 2026

మంథని లో గెలుపు బీజేపీ పార్టీదే

– కార్యకర్తలు మరింత పట్టుదలతో కష్టపడి పనిచేయాలి
– జిల్లా అధ్యక్షులు రావులరాజేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మంథని పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిలుగా జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బిఆర్ స్ కు గట్టి పోటీ ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ, బి ఆర్ స్ నియంత, కుటుంబ పాలనకు చరమ గీతం బీజేపీ పార్టీ తో పాడుదాం అని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుంది అని, కష్టపడి పని చేసే కార్యకర్తకు గుర్తింపు బీజేపీ పార్టీలో ఉంటుంది అని , దానికి నిదర్శనం మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అని అన్నారు. రానున్న రోజులో బీజేపీ మరింత పుంజుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. మంథని ప్రాంతంలో ప్రజలు మార్పు బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని, కాంగ్రెస్, బి ఆర్ స్ మంథనికి చేసిన అన్యాయని, దోపిడీని ప్రజలకి మనమే వివరించి ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలి అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ తెలంగాణలో ఈసారి బీజేపీ అనే నినాదం ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వినర్ మల్కామోహన్ రావ్, కో కన్వినర్ నాంపల్లి రమేష్, మండల ఇంచార్జ్ లు విరబోయిన రాజేందర్, తోట మధుకర్,పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,ముత్తారం మండల ఇంచార్జ్ పోతారవేని క్రాంతికుమార్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్, సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్,బోగోజు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.