వేములవాడ జూన్ 12 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని బాలికల జెడ్పి హైస్కూల్ పాఠశాలలో మన బస్తి- మనబడి గత సంవత్సరం సెప్టెంబర్ 2022లో శాసనసభ్యులు చెన్నమనే రమేష్ బాబు చేతుల మీదుగా పనులు ప్రారంభించారు 5.70 లక్ష తో.ప్రారంభమైన ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు కాంట్రాక్టు నిర్లక్ష్యంతో పనులు ఆపివేశాడు సోమవారం నుండి బడులు ప్రారంభమైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలలో మనబస్తీ మన- మనబడి కార్యక్రమంలో భాగంగా నాలుగు కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటివరకు కూడా పనులు పూర్తికాలేదు జిల్లా కలెక్టర్ రెండుసార్లు సందర్శించి కాంట్రాక్టర్లకు, అధికారులకు సకాలంలో పనులు పూర్తి చేసి స్కూల్లు ప్రారంభమయ్యే నాటికి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ పట్టించుకోకపోవడంపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, దీనిపై సిరిసిల్ల విద్యాశాఖ అధికారి రమేష్ ను వివరణ కోరగా పనులను త్వర లొనే కట్రాక్టర్ తో మాట్లాడి పూర్తి చేయిస్తామని అన్నారు,
బడులు ప్రారంభం …పూర్తికాని మన బస్తి- మనబడి పనులు




