గద్వాల నడిగడ్డ, జూలై 7 (జనం సాక్షి);
మాదిగ దండోరా 29వ ఆవిర్భవ దినోత్సవం, మాదిగ అణగారిన కులాల ఆశ జ్యోతి మందకృష్ణ మాదిగ పుట్టిన రోజు సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో శుక్రవారం మాధవ కృష్ణ హాస్పటల్ లో రోగులకు బ్రేడ్ పండ్లు దండోర నాయకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమము లో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు కొంకల భీమన్న మాదిగ,దండోరా వడేపల్లి మండల ప్రెసిడెంట్ పైపాడు ఏసోపు, ఎం ఎస్ ఎఫ్ మండల ప్రెసిడెంట్ రాజశేఖర్ మాదిగ, రామాపురం రాముడు మాదిగ, దండోరా నాయకులు, డాక్టర్ మాధవ్ కృష్ణ తది తరులు పాల్గొన్నారు.




