Wednesday, 4 November 2026

కేసీఆర్ ఆపద్భాందవుడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బిచ్కుంద జులై 07 (జనంసాక్షి) కేసీఆర్ ఆపద్భాందవుడని కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండల కేంద్రానికి చెందిన కర్రోలా రుక్మిణి హన్మండ్లు సీఎం రిలీఫ్ ఫండ్ 29000.00 రూపాయల చెక్ అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ పటేల్, జెడ్పిటిసి నాల్చర్ భారతి రాజు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు నాల్చర్ శ్రీనివాస్, దర్పల్ అశోక్, విట్టల్, సాకలి బశెట్టి తదితరులు పాల్గొన్నారు.