మందమర్రి మండలంలో ఘనంగా స్వామి వివేకానంద గారి 160 వ జయంతి వేడుకలు.
యువజన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మందమరి మండల శాఖ ఆధ్వర్యంలో పోన్నారం ( బూత్) గ్రామంలో స్వామి వివేకానంద గారి చిత్రపటానికి పూలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రపంచ యువతకు స్వామి వివేకానంద గారు ఒక ఆదర్శమూర్తిగా కీర్తి పొందారు. అతి చిన్న వయసులోనే వివేకానంద దేశ విదేశాల్లో యువజన సదస్సులో ప్రపంచ పేరు ప్రఖ్యాతలు సంపాదించి . దేశ యువత కు ధైర్యం నూరి పోసి ప్రశ్నించే విధానం నేర్పిన స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో యువత నడవాలని . యువత వారి గ్రామానికి పట్టణానికి మండలానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి సేవ చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాలని మందమరి మండల శాఖ తరపున యువతకు విజ్ఞప్తి చేస్తున్నా0.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు బోర్లకుంట్ల లక్ష్మణ్ . జిల్లా కార్యవర్గ సభ్యులు దొండ సంపత్. మండల ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్. యువ మోర్చా మండల అధ్యక్షులు పెంచాల రంజిత్. కాపురపు వినయ్. మాస్ నల్లు. కాపురపు సతీష్. మల్లెపల్లి కుమార్. సురిమిల్ల సురేందర్. లు పాల్గొన్నారు




