Thursday, 5 November 2026

ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విన్ 1144 వెరైటీ ద్వారా అధిక దిగుబడులు

ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ అశ్విన్ 1144 వెరైటీ ద్వారా అధిక దిగుబడులు..

ఆనందం వ్యక్తం చేసిన రైతు బానోత్ సురేష్

 

కేసముద్రం జనవరి 12 జనం సాక్షి /కేసముద్రం మండలం పెనుగొండ శివారు లక్ష్మీపురం తండాకు చెందిన బానోత్ సురేష్ అనే రైతు తన ఎకరం నరలో మిర్చి తోటను పండించారు.మిర్చి తోట వేసే ముందు రాఘవేంద్ర అగ్రి మాల్,ప్రజ్వల్ సీడ్స్ మహబూబాబాద్ సేల్స్ ఆఫీసర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సూచనలతో ప్రజ్వల్ సీడ్స్ పిఎస్ అశ్విని 1144వెరైటీ సీడ్ ను తీసుకోవడం జరిగింది.నాటిన నుండి నేటి వరకు ప్రజ్వల్ సీడ్ సేల్స్అపిసర్ సురేష్ సలహా సూచనలతో మందులు పిచికారి చేయడం జరిగింది.నేటి వరకు పంటకు ఎలాంటి రోగం రాకపోవడంతో పంట దిగుబడి అధిక పూత,కాయలు కాయడం జరిగింది.నల్లి ఉన్న సమయంలో కూడా ఎలాంటి పురుగులు,దోమలు తెగుళ్లు రాకపోవడంతో సదరు రైతు ఆనందం వ్యక్తం చేశాడు.బానోత్ సురేష్ మిర్చి తోటను చూడడానికి చుట్టుపక్కల రైతులందరూ విచ్చేసి ఆసక్తిగా తిలకించారు.భవిష్యత్తులో రైతులను సలహా సూచనలు ఇస్తున్న రాఘవేంద్ర అగ్రి మాల్ షాప్ ను సందర్శించగలరని రైతు వ్యక్తం చేశాడు.అనంతరం రైతు బానోత్ సురేష్ రాఘవేంద్ర అగ్రిమాల్, ప్రజ్వల్ సీడ్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.