మందాడి సత్యనారాయణ రెడ్డి పార్థీవ దేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి, శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర మంత్రి ఎర్రవెల్లీ దయాకర్ రావు..
హన్మకొండ బ్యూరో చీఫ్ 14 నవంబర్ జనంసాక్షి
మందాడి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారిని ఓదార్చారు. తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు తీరని లోటు
వారు ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారు,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.




