Friday, 6 November 2026

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్.14(జనంసాక్షి)

జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అధ్యక్షతన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలలో మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ పాల్గొని జవహర్ లాల్ నెహ్రూ, గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ ల చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులుగా మీరు నిత్యం గ్రంథాలయానికి వెళ్తూ విజ్ఞానం పెంచుకోవాలని, ఒక గ్రంథాలయం దగ్గరికి వస్తే నమ్మకమైన మేధోభరితమైన సమాచారం పుస్తకాల్లోనూ పత్రికల్లోనూ లభ్యం అవుతుందని, విజ్ఞానం పెంచుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు. యువతరం అంతర్జాల మాయలో పడి (ఫోన్) జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని, బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాలయాలలో పుస్తకాలు చదివి ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ప్రసిద్ధి పొందాడని అలా అందరూ ఆయన అడుగుజాడల్లో చదువుకొని గొప్పవాళ్లు కావాలని ఆశిస్తున్నానన్నారు. విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు అది చదువుకున్న వారికి మాత్రమే సొంతమని హైస్కూల్ స్థాయి కళాశాల స్థాయి విద్యార్థిని విద్యార్థులకు, గ్రంథాలయ పాఠకులకు తగు సలహాలు సూచనలు చేశారు. అనంతరం హై స్కూల్ స్థాయి విద్యార్థిని విద్యార్థులకు చాచా నెహ్రు చిత్రపటం మీద చిత్రలేఖనం పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 120 మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సుధారాని, మురళి గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి టి శ్రీలత, గ్రంథాలయ సంస్థ పాలకమండలి సభ్యులు పెద్ది సైదులు, నిమ్మల శ్రీనివాస్, బజ్జూరి
ఉమా, తేళ్ల శ్రీనివాస్, అశోక్, సురేందర్ ,లైబ్రేరియన్ జి విజేందర్, సిహెచ్ రవి, రుద్రారపు వీరేందర్, ఎం విజయ్, బొడ్డుపల్లి భూలక్ష్మి, రూప్సింగ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.