మందుబాబుల వీరంగం

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మందుబాబులు వీరంగం సృష్టించారు. మందుబాబుల వీరంగాన్ని అడ్డుకోబోయిన హోంగార్డు పై వారు రాళ్లు విసిరారు. రాళ్లు విసరడంతో హోంగార్డుకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. మందుబాబులను పోలీసులు అరెస్టు చేశారు