Wednesday, 4 November 2026

మక్తల్ లో ఘనంగా డీకే అరుణమ్మ జన్మదిన వేడుకలు

 

 

 

 

 

మక్తల్, మే 4 (జనంసాక్షి):భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు డీకే అరుణమ్మ జన్మదిన వేడుకలను మక్తల్ పట్టణంలో బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కర్నే స్వామి, ఎంపిటిసి బలరాం రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి జన్మదిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య పాల్గొన్నారు. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ఉండేలా పడమటి ఆంజనేయస్వామి వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయస్వామికి అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి. కొండయ్య బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలసి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ కర్నె స్వామి, కాచువార్ ఎంపిటిసి బలరాం రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరసింహారెడ్డి, బిజెపి టౌన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, కల్లూరి నాగప్ప, బాల్చేడ్ మల్లికార్జున్, రహీం పటేల్, జయనంద్ రెడ్డి, శ్రీనివాసులు, బుగ్గన్న,మంజునాథ్, నర్సప్ప, తదితర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.