Thursday, 5 November 2026

మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించాలి

మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించాలి.
షీటీం సిబ్బంది .శేఖర్ మమత.
తాండూరు డిసెంబర్ 8(జనంసాక్షి) నేటిసమాజంలోమగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించాలని షీటీం సిబ్బంది .శేఖర్ మమత పేర్కొన్నారు.గురువారం జిల్లా ఎస్పీ ఎన్, కోటిరెడ్డి ఆదేశాల మేరకు డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అవగాహనా సాధస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా
షీటీం సిబ్బంది .శేఖర్ మమత మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల లింగ వివక్షత చూపరాదన్నారు .మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని కూడా చదివించాలని సూచించారు.బాల్య వివాహాలు నిర్మూలించి ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పేర్కొన్నారు.నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు మహిళాలు, పిల్లల భద్రత విభాగం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని
మహిళలు పిల్లలు తమపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు హెల్ప్ లైన్ నెంబర్లు, 100, 112, 1098 నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు .హెల్ప్ లైన్ లపై విద్యార్థినిలు గ్రామాల్లో ఉన్న మహిళలకు అవగాహన కల్పించలన్నారు.ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు . చైల్డ్ లైన్ సిబ్బంది హన్మంతు ,నరేష్ నర్సిములు షీటిం సిబ్బంది శేఖర్ హెచ్ సి ,మమ
త డబ్ల్యు పి.సి లు విద్యార్థులు పాల్గొన్నారు.