Thursday, 5 November 2026

శబరిమలకు వెళ్తున్న స్వాములకు సన్మానం టిఆర్ఎస్

శబరిమలకు వెళ్తున్న స్వాములకు సన్మానం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 8జనం సాక్షి న్యూస్ : దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని టీఆరెస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్ అన్నారు. గురువారం ఆయన ఇరుముడి కట్టుకొని శబరిమల కు వెళుతున్న స్వాముల ను ఉద్దేశించి మాట్లాడారు.41 రోజులు అయ్యప్ప స్వామి ని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆ స్వామి ని దర్శించుకోవడం మన పూర్వ జన్మ ఫలితం అని అన్నారు.ప్రతి ఒక్కరు ధర్మం, న్యాయం, ను పాటించాలని అన్నారు.శబరిమల కు వెళ్ళిన, వారిలో వరకాలపాండు స్వామి,తోటపల్లి కృష్ణ స్వామి,అంజయ్య స్వామి,సాయి స్వామి తదితర స్వాములు వున్నారు