Wednesday, 4 November 2026

మట్టి మాఫియాకు తెగబడ్డ అక్రమార్కుల పై చర్యలు తీసుకోవా లి – సి పి ఐ

 

*నిశి రాత్రులలో మట్టి దోపిడి
*పక్క రాష్ట్రాలకు అక్రమ తోలకాలు
*అధికారుల కనుసన్నల తోనే
అనే ఆరోపణలుపెనుబల్లి,జనవరి24(జనం సాక్షి) అర్ధ రాత్రులు గుట్టు చప్పుడు గా గుట్టలను తొవ్వి అక్రమంగా పక్క రాష్ట్రాలకు మట్టి తొలకాలు చేపడుతున్న మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని పెనుబల్లి మండలం సి పి ఐ పార్టీ కార్యదర్శి కొమ్మినేని సుధాకర్ సంభందిత ఆధి కారులను డిమాండ్ చేశారు, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలింగగూడెం గ్రామ పంచాయితి రెవెన్యూ లో ఉన్న చిట్యాల బోడు,దేవతలగుట్ట, గౌరారం రెవెన్యూ లో టేకులగుట్ట ల పై గిరిజన చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా మట్టి,ఖనిజ సంపదను దోచుకుంటూ సహజ వనరులను కొల్లగొడుతున్నా రని,ఈ మైనింగ్ వలన సహజ సిద్ధమైన గుట్టలు కనుమరుగు అవుతున్నాయి అని, గుట్టలు చుట్టూ ఉన్న గ్రామాల్లో బాంబుల పేలుళ్లతో ఇళ్ళు బీటలు వారుతున్నప్పటికి ప్రభుత్వంఅధికారులు స్పందించడం లేదని,చివరికి ప్రభుత్వ గుట్టల్లో మట్టి ఆంధ్ర రాష్ట్రం తిరువూరు లోని ఇళ్ళ ప్లాట్ల వెంచర్లకు ప్రోక్లైన్, ట్రిప్పర్లు తో మట్టి తోలకాలు జరుపు తుంటే అధికారులకు తెలవడం లేదని కొమ్మినేని సుధాకర్ విమర్శించారు, దీన్ని బట్టి చూస్తే అధికారులే మాఫియాకు అండగా వుంటున్నారని బహిర్గత మౌతుందని అన్నారు, టీపీ వున్నదని మాఫియా వర్గాలు చెబుతున్నాయ ని,గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ గుట్టలను తొలిచి, ఇళ్ళల్లో, వెంచర్లకు మట్టి తోలాడానికి అధికారులు టిపి లు ఎలా ఇస్తారని సుధాకర్ ప్రశ్నించారు.అసలు ఈ మాఫియాకు అధికారుల వైపు నుండి ఎటువంటి అనుమతులు ఇచ్చారో ప్రజలకు తెలియ పర్చాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై సీపీఐ కార్యకర్తలతో గుట్ట పై తోలకాలను రెండు సార్లు ట్రిప్పర్లను అడ్డుకోవడం జరిగిందని,అయినప్పటికీ రాత్రి సమయాల్లో తోలుతున్నారని, వివిధ ప్రాంతలనుండి వచ్చి చట్టాలను ఉల్లంఘించి మట్టి,ఖనిజ సంపద తరలిస్తున్న మైనింగ్ మాఫియా పై అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.