Wednesday, 4 November 2026

పదవతరగతి పరీక్ష ప్రశ్నపత్రం నమునా పై అవగాహన

జుక్కల్, జనవరి 24,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని సాంఘీక గురుకుల పాఠశాలలో మంగళవారం మారిన పదవ తరగతి పరీక్షా ప్రశ్న పత్రం నమూనా పై నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, ఉపాధ్యాయులు రామాంజనేయులు, శివ ప్రసాద్,ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.