మతాలకతీతంగా స్వామి వారి సేవలో ఉస్మాన్ గని
మల్దకల్ డిసెంబర్ 10 (జనంసాక్షి)మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు గత 30 సంవత్సరాలుగా మతాలకతీతంగా దాసరిపల్లి గ్రామానికి చెందిన ఉస్మాన్ గని స్వామివారి బ్రహ్మోత్సవాలకు కళ్యాణానికి అవసరమయ్యే పట్టు వస్త్రాలను కుడుతు భక్తిని చాటుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు, సత్య చంద్రారెడ్డి శాలువా ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తాటికుంట మధుసూదన్ రెడ్డి,వీరారెడ్డి, చంద్రశేఖర రావు,తదితరులు పాల్గొన్నారు.




