Thursday, 5 November 2026

మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి

హైదరాబాద్ : ఓ యువతికి మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ దారుణం ముషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. సబర్మతినగర్‌కు చెందిన ఓ యువతి(18) ఇళ్లల్లో పని చేస్తుంటుంది. శుక్రవారం రాత్రి మోహిదీపట్నంలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరిందిఅప్పటికే ఆమెపై కన్నేసిన(వరుసకు బావ అయిన) డీబీఆర్ మిల్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ఉస్మాన్(35) తమ స్నేహితుడు పియూష్(28)తో కలిసి ఆమె వెళ్తున్న ఆటోను తన ఆటోలో వెంబడించారు. ట్యాంక్‌బండ్ కట్టమైసమ్మ దేవాలయం వద్దకు చేరుకోగానే ఆ యువతి వెళ్తున్న ఆటోను నిలిపి వేయించి, తాను ఉన్న ఆటోలో అంబేద్కర్ భవన్ వైపు తీసుకువెళ్లాడు. అప్పటికే తన స్నేహితుడితో కలిసి పథకం వేసుకొని ఉన్న అతను కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చారు. తాగిన కొద్దిసేపటికే మత్తులోకి జారుకోగా ఇదే అదునుగా భావించిన ఉస్మాన్, అతని స్నేహితుడు పియూష్ ట్యాంక్‌బండ్ డీబీఆర్ మిల్ చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యం చేశారు. రాత్రి 1 గంటకు ఆమెను ఆటోలో తీసుకువచ్చి కవాడిగూడ న్యూబ్రిడ్జి వద్ద వదిలిపెట్టి పారిపోయారు.అయితే ఆ యువతిని ఆటోలో నుంచి దింపుతున్నప్పుడు తెలిసిన వారు గమనించి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *