జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా మత్స్య శాఖ అధికారి భాస్కర్ అధ్యక్షతన జరిగిన మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్, డైరెక్టర్ల ఎన్నిక సందర్భంగా పోతరవేని క్రాంతి ని మంథని మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు 13 సభ్యులు ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక మత్స్యశాఖను బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని రానున్న రోజుల్లో చైర్మన్ కలిపాక నర్సయ్య సహకారంతో మత్స్యశాఖను మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క మత్స్యకారునికి తగువిధంగా ప్రభుత్వ ఫలాలు అందేలాగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.మత్స్య కార్యకుల సమస్యలపై అనుక్షణం ప్రతినిధిగా ఉంటూ తీర్చడానికి ప్రయత్నం చేస్తా అని నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన మంథని మండలం ప్రతి ఒక్క అధ్యక్షునికి క్రాంతి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
మత్స్యపారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా పోతరవేని క్రాంతి కుమార్




