జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో మండలంలోని గుండారం గ్రామ సమ్మక్క నగర్ లో సైడ్ డ్రైనేజ్ పనులను మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో సినరేజ్ గ్రాంట్ నుండి 3 లక్షల 80 వేలు మంజూరు చేసి, సైడ్ డ్రైన్ నిర్మిస్తున్న పుట్ట మధూకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓదెలు, ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, వార్డ్ సభ్యులు గోస్కుల సమ్మక్క, భూంపల్లి కుమార్, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, ఆకుల గట్టయ్య పిడుగు అంజి, పిడుగు సంపత్, గోస్కుల కనుకయ్య, పిడుగు గట్టయ్య, గోస్కుల కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు. 
గుండారంలో సైడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభం




