Wednesday, 4 November 2026

మద్యం విక్రయ కేంద్రాలపై తుది నర్ణయం

హైదరాబాద్‌: ఎమ్మార్పీ ఉల్లంఘనలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలతోపాటు కల్తీ మద్యం జోరుగా జరిగేచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చీప్‌ లిక్కర్‌ దుకాణాలను నెలకొల్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోమవారం కమిషనర్‌ సమీర్‌శర్మకు నివేదిక సమర్పించనున్నారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే అయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ప్రాంతాల్లో కల్తీమధ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే ఏపీబీసీఎల్‌ ద్వారా దుకాణాల్లో కేవలం చీప్‌ లిక్కర్‌ మాత్రమే పెట్టి విక్రయించేందుకు నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *