Wednesday, 4 November 2026

మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ : డిపోల నుంచి మద్యం సరఫరాకు స్వేచ్ఛనిస్తూ తెలంగాణ బీసీఎల్‌కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం అమ్మకాలపై వచ్చే మొత్తాలను ఉమ్మడి ఖాతాలో ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉమ్మడి ఖాతా మొత్తాన్ని వినియోగించకూడదని ఆదేశించింది. సరకు నిల్వల జాబితాను ఐటీ శాఖకు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *