* పోలీసుల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు
టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని మద్రాస్ తండా గ్రామానికి చెందిన భదావత్ హాచ్చు(42) సోమవారం ఉదయం పురుగు మందు తాగి కొత్తగూడెం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. టేకులపల్లి ఎస్సై కథనం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన బాదావత్ హచ్ కుమారుడు నరేష్ ఒక మైనర్ బాలికను ప్రేమించి ఆ బాలికను ఎక్కడికో తీసుకోని వెళ్లారని, అట్టి సంఘటనపై టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందన్నారు. ఈ క్రమంలో తన కొడుకు చేసిన పనికి మనస్తాపం చెంది హచ్చు సోమవారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు సేవించడంతో గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు . దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భూక్య శ్రీనివాస్ తెలిపారు.
ఎస్సై వేధింపులే హచ్చు ఆత్మహత్యకు కారణం:
* కుటుంబ సభ్యుల ఆరోపణ
మృతుడు కుమారుడు మైనర్ బాలికను ప్రేమించాడని కేసు నమోదు చేసిన ఎస్ఐ, రిమాండ్ కు పంపకుండా ఈనెల 16 నుండి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నాడని, ఎస్సై కౌన్సిలింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నాడని, ఆ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పూనుకున్నాడని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయకుండాకాసేపు ఎస్సైను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఎస్ఐ వారిని వారించి సర్ది చెప్పారు. అనంతరం పోస్టుమార్టం కార్యక్రమం నిర్వహించారు.




