Thursday, 5 November 2026

వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

 

మల్దకల్ జనవరి 23 (జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.అర్చకులు రవి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మనసాని నాగరాజు, నరహరి ప్రవీణ్, బాదామి రాజు,పద్మనాభయ్య, పల్లా వెంకటేష్, నరహరి సురేష్, శ్రీనివాసులు,నరేందర్, లక్ష్మీదేవమ్మ,సువర్ణమ్మ, మంజుల, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.