సోమాజిగూడ : మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు నోటి ఆరోగ్యం, శుభ్రతపై అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలని ఎస్‌వీఎస్ డెంటల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సాయినాథ్ అన్నారు. ఆదివారం డయాబెటిక్ సెల్ఫ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్‌లో ద సిక్స్త్ కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటిక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ సాయినాథ్ మాట్లాడారు. అధిక రక్తపోటు, మధుమేహం నోటి సమస్యలకు కారణమవుతాన్నారు. రోజూ తప్పనిసరిగా రెండు సార్లు దంతాలను తోముకోవాలి. పంచదార తక్కువగా తీసుకోవాలి. పొగ తాగడం పూర్తిగా మానివేసి దంత వైద్యులను ప్రతి ఆరు నెలలకోమారు కలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పి.వి.రావు, పి.ఉషాబాల, కృషారెడ్డి, సి.కృష్ణారావు పాల్గొన్నారు.




