Tuesday, 3 November 2026

ప్రకాశం జిల్లాలో భారీ దోపిడీ

మార్టూరు, జిల్లాలోని మార్టూరు పట్టణంలో మువ్వ అంజయ్య అనే గ్రానైట్‌ యజమాని ఇంట్లో గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి రెండుగంటలకు కత్తులు, రాడ్లతో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. అంజయ్య కుటుంబసభ్యులను కట్టేసి 78 సవర్ల బంగారం, వెండి కొంత నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేర పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దోపిడీ దొంగల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ఆరంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *