మధు హత్య కేసు నిందితులు అరెస్టు

నెల్లూరు, జూలై 31: ఈ నెల 18న నెల్లూరు నగరంలోని ముత్యాలంపాడులో జరిగిన గద్దె మధు హత్య కేసులో నిందితులు జె.శివప్రసాద్‌, సుమన్‌, శరత్‌బాబులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2007లో ఒక హత్యకు సంబంధించి మృతుడు మధుకు, నిందితులకు మధ్య పాతకక్షలు ఉన్నాయని, ఈ క్రమంలో మృతుడికి ఈ నెల 18 మధ్యాహ్నం నగరంలోని వైఎంసిఎ గ్రౌండ్‌లో మద్యం తాగించి రాళ్లతో కొట్టి చంపారని ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు.

తాజావార్తలు