మధ్యాహ్న భోజన పథకానికి ఆర్థిక సాయం అందజేత
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న రూ.10 మధ్యాహ్న భోజన పథకానికి ఆ కళాశాల పూర్వ విద్యార్థి గోవర్ధన్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.రంగారెడ్డి జిల్లా యాచారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పదవి విరమణ పొందిన గోవర్ధన్ కళాశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి తెలుసుకొని కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేశులు కు బుధవారం చెక్ ను అందజేశారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటేశులు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే విశేష స్పందన వచ్చిందన్నారు.కళాశాలను గుర్తుంచుకొని సహాయం చేయుటకు ముందుకు వస్తున్న పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.పూర్వ విద్యార్థుల సహాయ, సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో ఎస్టేట్ ఆఫీసర్ మూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డానం శ్రీనివాస్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




