బూరుగడ్డలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు హుజూర్ నగర్ డిసెంబర్ 28 (జనం సాక్షి) : మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని శ్రీ ఆదివరాహ లక్ష్మీనరసింహ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ధనుర్మాస వ్రతం మార్గాలిలో 13వ రోజు స్వామికి, అమ్మవారికి, సుప్రభాత సేవ, ఆరాధన, అష్టోత్తర శతనామావళి,సేవా కాలము, ఆరగింపు,మంగళాశాసనం, పల్లకి సేవ, తదనంతరం తీర్థ ప్రసాద వినియోగం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంపీ లక్ష్మణరావు, ఆలయ అర్చకులు ముడుంబై హరీష్ కుమార్ చార్యులు, ముడుంబై మనోహరాచార్యులు, యరగాని కిరణ్ గౌడ్, గ్రామ పెద్దలు, గ్రామ భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
బూరుగడ్డలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు




