సోనియా నేతృత్వంలో సంఘీభావ ప్రదర్శన
న్యూఢిల్లీ, మార్చి 12 : బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనకు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మద్దతు తెలిపారు. గురువారం ఉదయం టెన్‌జన్‌పథ్ నుంచి సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నేతలు మన్మోహన్ నివాసానికి పాదయాత్రగా వెళ్లారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ మన్మోహన్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నామని, ఆయనకు కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. మన్మోహన్ చిత్తశుద్ధి ప్రపంచానికి తెలుసని ఈ కేసు నుంచి ఆయన నిర్దోషిగా బయటపడతారనే నమ్మకం ఉందని అన్నారు. మన్మోహన్ మీద ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తామని సోనియా తెలిపారు.




