Tuesday, 3 November 2026

మన్యం మసులుతోంది.. వణికిస్తున్న డెంగ్యూ ఫివర్స్ మండలంపై జ్వర పంజా.విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా. – నెల రోజుల్లో వందలాది మంది ఆసుపత్రులపాలు. – వైద్యశిబిరాలు ఏర్పాటుచేయని వైద్యఆరోగ్యశాఖ.

కరకగూడెం,(జనంసాక్షి): మన్యం ప్రాంతం మసిలిపోతోంది. నెలరోజులుగా కరకగూడెం మండలం లోని పలు గ్రామాల్లో జ్వరాలు విజృంబిస్తున్నాయి. ఇంటికి ఒక్కరిద్దరు చొప్పున మలేరియా, డెంగ్యూతో మంచం పడుతున్నారు. కొందరు మెరుగైన వైద్యంకోసం పట్టణాలకు పరుగు తీస్తుండగా, మరికొందరు స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్య ఖర్చులకు కనీస స్థోమత లేనివారు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం ప్రతీరోజు మలేరియా, రెండు డెండ్యూ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మండల కేంద్రంలో ఈ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రతీ వీధిలో, ప్రతీ ఇంట్లో జ్వర బాధితులు కనిపిస్తున్నారు. మండలంలో ఇంతలా జ్వ రాలు విజృంభిస్తున్నా వైద్యఆరోగ్య శాఖ ఏమ్రాతం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జ్వరాలు ఉన్నచోట కూడా ఒక్క వైద్యశిబిరం పెట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.– ఎక్కడ చూసినా జ్వర బాధితులే..మండల కేంద్రంలో ఉన్న 16 పంచాయతీలు చూసుకుంటే ఆయా గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాలలో కాలనీలలో ఇలా ప్రతి వీధిలోను కిక్కిరిస్తున్నాయి. రక్త పరీక్షల్లో ప్రతీరోజు డెంగ్యూ (ఎన్ఎస్) మలేరియా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలు, ఆర్ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరి కొంతమంది సమీపంలోని భద్రాచలంలో ప్రైవేట్ వైద్యశాలకు వెళుతున్నారు. డబ్బు లేకపోయినా అప్పులు చేసి మరీ వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. భద్రాచలం కొత్తగూడెంలో ఉన్న ప్రైవేట్ వైద్యశాలల్లో ఎక్కడ చూసినా కరకగూడెం వాసులే కనిపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.మండల కేంద్రం తో సహా ఇతర గ్రామాల్లో కూడా జ్వర బాధితులు కనిపి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పలు ఏజెన్సీ మండలాల్లో గ్రామాల్లో అధికంగా విజృంభిస్తున్నాయని, దాంతో స్థానిక పీహెచ్సీలు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని సమాచారం.– వైద్యశిబిరాలు ఏవీ ?కరకగూడెం మండల కేంద్రంతో పాటు, ఇతర గ్రామాల్లో రోజురోజుకూ జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య అధిక మవుతున్నా వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారిం చడం లేదనే విమర్శలున్నాయి. తూతూ మంత్రంగా కొంత మంది కిందిస్థాయి సిబ్బందితో సర్వేలు చేయించి చేతులు దులుపు కుంటున్నాదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల నుంచి మెప్పు పొందేందుకు ఫొటోలు దిగి వాట్సాప్లో పెట్టి చేతులు దులుపు కుంటున్నారని తెలుస్తోంది. కాగా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్క వైద్య సిబీరం కూడా పెట్టలేదనే ఆరోపణలున్నాయి. మండలంలో జ్వరాల తీవ్రత అధికంగా ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ చర్యలు | తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.– డెంగ్యూతో ఇద్దరు మహిళలు మృతిడెంగ్యూతో ఇద్దరు మహిళలు మృతిచెందిన సంఘటన కరకగూడెం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సీ వాడకు చెందిన డేగల మాణిక్యం (50) మూడు రోజుల క్రితం జ్వ రంతో కరకగూడెంలో వైద్య పరీక్షలు చేయించగా డెంగ్యూ లక్షణాలున్నాయని నిర్ధారణైంది. దీంతో ఆమెను భద్రా చలంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. ఆమె పరిస్థితి విషమించడంతో ఖమ్మం వైద్యశాలకు తరలించాలని వైద్యులు తెలిపారు. కానీ వారి వద్ద నగదు లేకపోవడంతో | సోమవారం ఉదయం భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అప్పటికే ప్లేట్లెట్లు తగ్గి తీవ్ర అస్వస్థతతో ఉన్న మాణిక్యం సోమవారం సాయంత్రం. మృతి చెందిందని వైద్యులు తెలిపారని తెలిపారు. అయితే ఇటీవల అదే గ్రా మానికి చెందిన మలిపెద్ది సంధ్య అనే మహిళ కూడా డెంగ్యూతో మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.