వరంగల్ ఈస్ట్, మే 29 (జనం సాక్షి)స్వాతంత్ర్యకాలం నాటి నుండి నేటికీ అకుంఠిత దీక్షతో ఉపాధ్యాయ ,సామాజిక సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్(నాడు ఏ పీ టి ఎఫ్) నేడు(టి పి టి ఎఫ్) ,తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ను నిర్మాణం మరియు పని సంస్కృతి రీత్యా మరింత బలోపేతం చేయాలని పోరాటాల ద్వారానే ఉపాద్యాయ,విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని,ప్రభుత్వం వెంటనే ఉపాద్యాయులు సమస్యలు పరిష్కరించాలనీ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్.(టి.పి.టి.ఎఫ్) సోమవారం వరంగల్ జిల్లా కమటి అధ్వర్యంలో వరంగల్ లోనిర్వహించిన ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవానికి భోగేశ్వర్ అతిథిగా హాజరై ఫెడరేషన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అనేక ఒడిదుడుకులను ,విచ్ఛిన శక్తులను తట్టుకొని ఏడున్నర వసంతాలుగా ఫెడరేషన్ ఉపాధ్యాయుల ఐక్యత , వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలనిర్వహిస్తుందని అన్నారు.కార్యక్రమానికి అధ్యక్షతవహించిన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లం మాట్లాడుతూ అధ్యయనం,పోరాటం సమలక్ష్యాలుగా ఐక్య పోరాటాలతో మిగతాసంఘాలకన్నా మెరుగు గా కొనసాగుతున్నటి.పి.టి.ఎఫ్.లో నూతనతరం చేరాలని ఆకాంక్షించారు.ఉపాధ్యాయదర్శిని అధికార పత్రిక సంపాదక వర్గ సభ్యులు అజయ్ బాబు మాట్లాడుతూ ఫెడరేషన్ ఉద్యమాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండాకొనసాగటా
నికి మార్గదర్శకులైన చెన్ను పాటి లక్ష్మయ్య పరమేశ్వర్ రావు వంటి నాటి తరం నాయకుల పనితీరు గురించి వివరించారు.ఎన్ కౌంటర్లు అరెస్టులను ఎదుర్కొన్న నిఖార్సైన పోరాట పాఠాలు,వారి పనితీరును ప్రతి కార్య
కర్త ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు బెల్లంకొండ రమేశ్. జిల్లా ఉపాధ్యక్షులు జె.స్వామి,కార్యదర్శి పూజారి మనోజ్ గౌడ్,ఎ.కె.తన్వీర్,ఈదుల వీరాస్వామి,వరంగల్, ఖిల వరంగల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బెల్లంకొండ పూర్ణ చందర్,డి రమేష్,దినేష్,ఆకుల కుమారస్వామి లు పాల్గొన్నారు.




