Tuesday, 3 November 2026

మన ఊరు మనబడి  కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా 12 రకాల మౌలిక వసతులు

 

 

 

 

 

కల్పన లో భాగంగామన ఊరు మనబడి  కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా 12 రకాల మౌలిక వసతులు కల్పన లో భాగంగాపలు అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటిని ప్రారంభించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డివీణవంక ఫిబ్రవరి 1 (జనం సాక్షి)వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం  ప్రాథమిక పాఠశాల ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి పాఠశాల తరగతులను పలు అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటికి ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి  ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు  కేటాయించిన గ్రీన్ చాక్ బోర్డులు డ్యూయల్ డెస్క్ లు  తరగతి గదులలో ట్యూబ్లైట్స్ ఫ్యాన్లు, పలు అభివృద్ధి పనులు  పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్టి పనులు త్వరిత గతంగా పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ మాధవరావుకు  కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా  గ్రామ సర్పంచ్ మోర సారయ్య  నాయకులు మాడ సాధవారెడ్డి   , ఉపసర్పంచ్ చొప్పరి తిరుపతి, కోఆప్షన్ మెంబర్  రవీందర్రావు, ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ ప్రభాకర్.ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి  ఏఈ రాంబాబు  పంచాయతీ కార్యదర్శి, మౌనిక, తదితరులు పాల్గొన్నారు…..